టాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ మంచి జోష్ లో ఉన్న హీరోల్లో దగ్గుబాటి రానా ఒకడు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేస్తున్న రానా ‘నన్నొదిలేయండి బాబూ… నాకంత టాలెంట్ లేదు’ అంటున్నాడు. ఇంతకీ రానా అలా అనడానికి కారణమేంటని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి ఈ మధ్యే బాలీవుడ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా ‘గల్లీబాయ్’. రణవీర్ సింగ్ హీరోగా రెగ్యులర్ గా ఇండియన్ సినిమాల్లో ఉండే తళుకుబెళుకులకు భిన్నంగా రియలిస్టిక్ ఫీల్ తో, ముంబై స్లమ్స్ వాతావరణం చూపిస్తూ జోయా అఖ్తర్ తెరకెక్కించిన ఈ సినిమాకు భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తున్న ఈ సినిమాపై మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టి పడింది. ఇప్పటికే రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గల్లీబాయ్’ని సాయి ధరమ్ తేజ్ తో రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లైఫ్ అనే ఇంగ్లీష్ పేపర్ వాళ్లు ‘గల్లీబాయ్’ తెలుగు రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తే బాగుంటుందని ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించారు. ఈ పోల్ లో రానాతో పాటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పోల్ గురించి తెలుసుకున్న రానా ‘నాకంత టాలెంట్ లేదు, నన్నొదిలేయండి’ అంటూ ట్వీట్ చేశాడు. రానా ట్వీట్ చూసిన అతని అభిమానులు గల్లీ బాయ్ సినిమాకి రానా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని, అతని టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంటూ, రణవీర్ పాత్రకి సరిగ్గా సరిపోతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ ని కాంప్లిమెంట్స్ కన్సిడర్ చేసి రానా గల్లీ తెలుగు బాయ్ సినిమాలో నటిస్తాడేమో చూడాలి.
previous post
next post