Animal Teaser: “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” టీజర్ కొద్ది నిమిషాల క్రితం విడుదలయ్యింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో స్టోరీ రూపొందించినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. హీరోలో విలన్ ఇజం చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన రణబీర్ కపూర్ ని చాలా వైవిధ్యంగా క్రూరంగా యానిమల్ లో చూపించడం జరిగింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు తండ్రి కొడుకుల నేపథ్యంలో చాలా వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. కానీ “యానిమల్” మాత్రం అన్నిటికీ మించి చాలా కొత్త తరహా జోనర్ లో. తీసినట్లు టీజర్ బట్టి తెలుస్తుంది.
ఎంతో కోపం కలిగిన కొడుకు తండ్రి కోపపడిన ఎలా తన ఆవేశాన్ని అనుచుకుంటాడు. ఎందుకు కొడుకు సహనంతో ఉన్నాడు అనేది టీజర్‌లో చెప్పకుండా వదిలేసిన పాయింట్. తండ్రి చిన్న మాట అంటే పడని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తండ్రి కొట్టినా, ఇంట్లో వాళ్లు తిట్టినా భరించేలా ఇంకా చెప్పాలంటే దాని కోసం ‘యానిమల్’ అయిపోయిన కొడుకు కథ ఈ సినిమా. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తనదైన శైలిలో సినిమా తీయడం జరిగింది. టీజర్ లో ఫస్ట్ షాట్ లో రష్మిక మందన అద్భుతంగా కనిపించింది. స్టైల్ అదేవిధంగా మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.
అనిల్ కపూర్ మరియు బాబి డియోల్ కూడా చాలా వైవిధ్యంగా కనిపించారు. రణబీర్ కపూర్ ని ఇప్పటివరకు ఎవరు చూడని చూపించని రీతిలో “యానిమల్” సినిమాలో సందీప్ రెడ్డి వంగ చూపిస్తున్నాడు. డిసెంబర్ మొదటి తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. హిందీ తోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ దర్శకుడు చూపించని రీతిలో.. “యానిమల్” సినిమాలో హీరోయిజం సందీప్ రెడ్డి వంగ చూపించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.