1983.. భారత క్రికెట్ చరిత్రలో మరచిపోలేని సంవత్సరం. వెస్టీండిస్‌ను ఓడించి భారత్ ప్రపంచ కప్ క్రికెట్లో విశ్వ విజేతగా అవతరించిన ఏడాది. ఇప్పుడు 1983లో కపిల్ డేర్ డెవిల్స్ అసాధారణ ప్రయాణాన్ని `83`పేరుతో సినిమాగా చిత్రీకరిస్తున్నారు. ఏదో ఆషామాషీగా కాకుండా ఈ సినిమాను కూడా అసాధారణంగానే చిత్రీకరించారు. పాత్రలకు తగ్గట్టు నటీనటులను దర్శక నిర్మాతలు ఎంపిక చేసిన క్రికెట్లో ట్రైనింగ్ ఇచ్చి మరి సినిమాను చిత్రీకరించారు. అలాగే అప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ ఎక్కడెక్కడ మ్యాచులను ఆడిందో అక్కడే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేస్తున్నారు. కబీర్ ఖాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కెప్టెన్ కపిల్‌దేవ్ ప్రాంతంలో రణ్వీర్ సింగ్ నటించారు. ముఖ్యంగా రణ్వీర్ కపిల్ దేవ్లా మేకోవర్ కావడం విశేషం. కాగా.. కపిల్‌దేవ్ ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ నటరాజ్ షాట్ స్టిల్‌ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. రణ్వీర్ మేకోవర్‌ను చూసినవాళ్లందరూ షాకవుతున్నారు. రణ్వీర్ అంతలా మేకోవర్ అయ్యాడు. ఈ చిత్రంలో కపికల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె గెస్ట్ రోల్లో నటించారు.