సింబా రివ్యూ: ఎన్టీఆర్ సినిమాకి జై కొడుతున్న బాలీవుడ్

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్… 19 ఏళ్లకే స్టార్ స్టేటస్ అందుకోని, తిరుగులేని మాస్ ఫాలోయింగ్ అందుకున్న హీరో. అయితే ప్రస్తుతం వరస హిట్స్ లో ఉన్న ఎన్టీఆర్, ఒకప్పుడు బ్యాక్ ఫ్లాప్స్ తో కెరీర్ కష్టాల్లో పాడేసుకున్నాడు. తారక్ మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో, పక్కా హిట్ కొట్టాల్సిన సమయంలో ఎన్టీఆర్ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలిశాడు. అప్పటికి పూరి కూడా ఫ్లాప్స్ లోనే ఉండడంతో, తారక్ కెరీర్ లో మరో ఫ్లాప్ పడుంతుందని అందరూ అనుకున్నారు. సెట్స్ పై ఉన్నప్పుడు అసలు అంచనాలు లేని టెంపర్ సినిమా, టీజర్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్స్పెక్టర్ దయగా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ని నందమూరి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈసారి అయినా ఎన్టీఆర్ హిట్ ఇస్తాడా అనే ఆశతో థియేటర్స్ కి వెళ్లిన ఫ్యాన్స్ కి తారక్ కంప్లీట్ నెగటివ్ రోల్ లో కనిపించి భారీ షాక్ ఇచ్చాడు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్స్, డాన్స్, కామెడీ, సీరియస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎమోషన్ ని అద్భుతంగా పలికించాడు. ఇది తారక్ బెస్ట్ సినిమా అనే రేంజులో టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి పోసాని నటన, వక్కంతం వంశీ కథ, పూరి డైలుగులు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా టెంపర్ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ లో తారక్ యాక్టింగ్ గురించి చాలా కాలమే చెప్పుకుంటారు.

కష్టాల్లో ఉన్న తారక్ కెరీర్ ని గట్టున పడేసిన ఈ సినిమాని బాలీవుడ్ ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటోంది. టెంపర్ ని రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి రీమేక్ చేశారు.. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు, క్రిటిక్స్ ని కూడా మెప్పించి యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో అందరి నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్న సినిమా ఇదేనేమో. సింగం సిరీస్ తో పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాలకి కెరాఫ్ అడ్రస్ గా మారిన రోహిత్ శెట్టి, మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడు. సింబాగా రణ్వీర్ సింగ్, టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. పాత్రకి కావాల్సిన ఎమోషన్స్ ని తెరపై అద్భుతంగా చూపించిన రణ్వీర్, హీ ఈజ్ ఏ సూపర్ స్టార్ ఇన్ మేకింగ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

సింబా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం, కథ. రోహిత్ శెట్టి… టెంపర్ కథలోని ఆత్మని డిస్టర్బ్ చేయకుండా, కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలుపుకుంటూ కొన్ని మార్పులు చేసి ప్రేక్షకులని మెప్పించాడు. మొత్తానికి వరసగా ఫ్లాప్స్ చూస్తున్న బాలీవుడ్ కి ఒక తెలుగు రీమేక్ సినిమా ఇయర్ ఎండింగ్ లో హిట్ ఇవ్వడం సంతోషించాల్సిన విషయం.


Share

Related posts

Adavi Sesh: కరోనా సమయంలో మంచి మనసు చాటుకున్న అడవి శేష్..!!

bharani jella

Yash Remuneration: ‘కేజీయఫ్ 2’ కోసం యష్ తీసున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వలిసిందే ??

Naina

అలాంటి పాత్ర చేయాల‌నుంది

Siva Prasad

Leave a Comment