NewsOrbit
Entertainment News సినిమా

IPL Opening Ceremony 2023: ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న రష్మిక, తమన్నా..!!

Share

IPL Opening Ceremony 2023: నేటి నుండి ఐపీఎల్ టోర్నీ స్టార్ట్ అవుతుంది. గుజరాత్ అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ బీసీసీఐ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేశారు. టాప్ హీరోయిన్స్ రష్మిక మందన, మిల్కీ బ్యూటీ తమన్న డాన్స్ చేయనున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ కి సౌత్ మొదలుకొని నార్త్ వరకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Rashmika and Tamannaah are going to give a live performance at the opening ceremony of IPL

ముఖ్యంగా రష్మిక మందనకీ..అయితే బీభత్సమైన క్రేజ్ ఉంది. 2021 లో వచ్చిన పుష్ప సినిమా రష్మిక మందనాకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ సినిమాలో రష్మిక మందన వేసిన స్టెప్పులు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో టాప్ మోస్ట్ ప్రాజెక్టులలో రష్మికకి అవకాశాలు వస్తూ ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక “పుష్ప” సినిమాతో తిరుగులేని క్రేజ్ ఓవర్ నైట్ లో సంపాదించింది. దీంతో రష్మిక మందన చేత ఐపిఎల్ ప్రారంభోత్సవంలో “పుష్ప” సాంగ్స్ కీ స్టెప్ లు ఏపీస్తున్నరట. ఈపాటికి రష్మిక అహ్మదాబాద్ కీ చేరుకోవడం జరిగింది.

Rashmika and Tamannaah are going to give a live performance at the opening ceremony of IPL

మరోపక్క మిల్కీ బ్యూటీ తమన్న సైతం… స్టెప్పులు వేయటానికి రెడీ అయిందట. ఇద్దరూ కలిసి పర్ఫామెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై జట్లు తలపడనున్నాయి. టైటిల్ ట్రోఫీ కోసం పది జట్లు దాదాపు 70 మ్యాచ్ లకు పైగా ఆడనున్నాయి. దాదాపు నెల రోజులకు పైగా ఈ టోర్నీ జరగనుంది. రేపు మినహా మిగతా సందర్భాలలో రోజుకు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. మరి ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ ఏ టీం గెలుస్తుందో చూడాలి.


Share

Related posts

Meghali Meenakshi Cute Images

Gallery Desk

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఫైట్ .. సెట్ చేసిన డైరెక్టర్..!!

sekhar

Prabhas: ఆదిపురుష్ మూవీలో ఎన్ని వండర్స్ ఉన్నాయంటే..?

GRK