Rashmika: రష్మిక మందన్న.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక.. మరోవైపు నేషనల్ క్రష్‌గానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది.
అయితే తాజాగా రష్మిక గురించి ఓ బిగ్ సీక్రెట్ లీక్ అయింది. అదేంటంటే.. బాలీవుడ్ చెందిన ఓ స్టార్ హీరోకు రష్మిక భార్య కాబోతోందట. అయితే ఇది రియల్ కాదులేండి.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `అర్జున్ రెడ్డి` సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆదే సినిమాను బాలీవుడ్లో `కబీర్ సింగ్` పేరుతో రీమేక్ చేసి అక్కడా సక్సెస్ అయ్యారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి బాలీవుడ్లో రణ్ బీర్ కపూర్‌తో `యానిమల్` అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణితి చోప్రాను హీరోయిన్గా అనుకున్నారు. కానీ, ఆమె పలు కారణాలు వల్ల యానిమల్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో రష్మికను ఎంపిక్ చేశారని.. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని టాక్ నడుస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ భార్య పాత్రలో రష్మిక కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, రష్మిక తెలుగులో `పుష్ప 2` సినిమా చేస్తోంది. అలగే `మిస్టర్ మజ్ను`. `గుడ్ బై` చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం రష్మిక చేతిలో ఉన్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!