NewsOrbit
Entertainment News సినిమా

Rashmika Mandana: విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన రష్మిక మందన..!!

Share

Rashmika Mandana: ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకల్లో హీరోయిన్ రష్మిక మందన అదిరిపోయే స్టెప్పులతో స్టేడియంలో అందరిలో జోష్ నింపిన సంగతి తెలిసిందే. 16వ ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో రష్మిక డాన్స్ షో చాలామందినీ ఆకట్టుకుంది. 2021 “పుష్ప” సినిమాతో నేషనల్ వైడ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక… ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో “పుష్ప” పాటలకు… గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు మైమరిచిపోయేలా స్టెప్పులు వేయడం జరిగింది. “పుష్ప”లోని శ్రీవల్లి సాంగ్.. ఇంకా “RRR” పాటలకు సూపర్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది.

Rashmika Mandana showered praises on Virat Kohli

ఇదే సమయంలో తమన్నా కూడా డాన్స్ వేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఇటీవల రష్మిక మందన.. స్టార్ స్పోర్ట్స్ అనే న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారత్ క్రికెట్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ తనకి ఇష్టమైన ఆటగాడు అని స్పష్టం చేసింది. విరాట్ సార్ ఆడే దూకుడు గేమ్ నాకు ఎంతగానో నచ్చుతుంది. ఇంకా నాకు ఐపీఎల్ లో ఆర్సిబి గెలవాలని ఉంది. నాకు ఇష్టమైన జట్టు కూడా అదే. ఎందుకంటే మాది బెంగళూరు కాబట్టి. కచ్చితంగా ఈసారి ఆర్సిబి టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నాను అని రష్మిక మందన స్పష్టం చేసింది.

Rashmika Mandana showered praises on Virat Kohli

ప్రస్తుతం రష్మిక….” పుష్ప 2″, “రైన్ బో” సినిమాలు చేస్తోంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత “గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ విజయం సాధించి… తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. 2021లో “పుష్ప” సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇప్పుడు తిరుగులేని కెరియర్ తో ఆలిండియా వైడ్ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.


Share

Related posts

U Turn : ‘యూటర్న్’ హిందీ రీమేక్..సమంత పాత్రలో ఆలయ

GRK

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండిషన్ తో ప్రొడ్యూసర్ కి ఫ్యూజ్ ఎగిరిపోయింది ??

sekhar

RRR : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ న్యూస్ వచ్చేసింది..!!

bharani jella