SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 4 బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. లేటెస్ట్ గా సర్కార్ వారి పాట. ఈ నాలుగు సినిమాలు మహేష్ కెరీర్ లో… రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టడం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు మహేష్ ఇద్దరు టాప్ మోస్ట్ దర్శకులతో పని చేస్తున్న సంగతి. డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు రాజమౌళి తో మహేష్ సినిమాలు చేయబోతున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు గత నెలలో స్టార్ట్ అయ్యాయి. జూలై నెల నుండి సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా గా ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం ప్రకారం రెండో హీరోయిన్ గా రష్మిక మందన నీ త్రివిక్రమ్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ గత కొద్దికాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కీలక పాత్రలో రష్మిక మందన నీ సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. రష్మిక మందన గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ నటించిన “సరిలేరు నీకెవ్వరు” లో హీరోయిన్ గా చేయడం తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. 2020లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత రష్మిక మందన నటించిన “పుష్ప” పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని విజయం సాధించడం మాత్రమే కాదు.. ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈ పరిణామంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న మహేష్ సినిమాకి సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందనకి త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…