Rashmika Mandanna: వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ సోయగం రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ భాషల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్న రష్మిక.. తాను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో ఓపెన్‌గానే చెప్పేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే పెళ్లి గురించి మాట్లాడుతూ.. `పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించిన ఆలోచనలను నా మనసులోకి రానీయడంలేదు. నన్ను ప్రేమగా, సురక్షితంగా చూసుకుంటారని ఎవరిపై నమ్మకం కుదిరితే వారినే పెళ్లి చేసుకుంటాను` అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రష్మిక గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. అయితే సరైన కారణం తెలీకపోయినా నిశ్చితార్థం అయిన ఏడాదికి రష్మిక రక్షిత్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా మారి వరుస హిట్లతో టాలీవుడ్లో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో `పుష్ప 2`, శర్వానంద్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాలు చేస్తోంది. అలాగే హిందీలో మిస్టర్ మజ్ను, గుడ్ బై చిత్రాల్లోనూ నటిస్తోంది.