Rashmika Mandanna: అనతి కాలంలోనే నేషనల్ క్రష్‌గా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన హాట్, కూట్ ఫొటోలు.. వీడియోలతో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటోంది.
ఇక తాజాగా ఈ బ్యూటీ యూట్యూబ్‌లోకి కూడా అడుగుపెట్టింది. గురువారం యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రష్మిక ప్రకటించింది. తన యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి అంటూ ఓ వీడియోను కూడా తన ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
అయితే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన సందర్భంగా తన అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలోనే రష్మిక ప్రేమ పాఠాలు వల్లించింది. తన ఎక్స్ లవ్ గురించి ఓ నెటిజన్ ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు రష్మిక `ప్రేమను వర్ణించడం ఎంతో కష్టం. ఎందుకంటే ఇది భావాలకు సంబంధించినది. ప్రేమ రెండు వైపులా ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది. ఒకవైపు మాత్రమే ఉంటే సరిపోదు` అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.
దీంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలోనే రష్మిక.. కన్నడలో తన తొలి సినిమా హీరో అయిన రక్షిత్ శెట్టిని ప్రేమించింది. వీరిద్దరికీ గ్రాండ్‌గా నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ.. రష్మిక, రక్షిత్‌లు బ్రేకప్ చెప్పుకుని నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.