Rashmika Mandanna:`ఊ అంటావా…మామా ఊఊ అంటావా మామ` సాంగ్‌తో ఈ మధ్య హీరోయిన్ సమంత ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `పుష్ప` సినిమాలోని ఐటెం సాంగ్ ఇది. ఈ స్పెసల్ సాంగ్‌లో సామ్ అదిరిపోయే స్టెప్పులతో పాటు అందాల ఆరబోతలోనూ రెచ్చిపోయింది. అయితే ఇప్పుడు ఈమెకు పోటీగా రష్మిక మందన్నా దిగుతోంది.
ఓవర్ ఎక్స్‌పోజింగ్‌కు కాస్త దూరంగా ఉండే రష్మిక.. ఈ మధ్య రూటు మార్చి హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టేస్తోంది. తాజాగా గ్రీన్ కలర్ టాప్, లెహంగాను ధరించిన రష్మిక.. ఎద అందాలను, నడుము ఒంపుసొంపులను ఎలివేట్ చేస్తూ కిర్రాక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఇంకేముంది రష్మిక హాట్ లుక్స్‌ను చూసి ఆగలేకపోతున్న కుర్రాళ్ళు.. రకరకాల కామెంట్లు చేస్తూ ఆమె పిక్స్‌పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు రష్మిక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయి. కాగా, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె శర్వానంద్‌కు జోడీగా `ఆడవాళ్లు మీకు జోహార్లు`, అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్లో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని చిత్రాలు సైతం రష్మిక చేతిలో ఉన్నాయి.