Rashmika mandanna: కన్నడ సోయగం రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఈమె చేసిన `గీత గోవిందం` చిత్రం కూడా హిట్ అవ్వడంతో.. రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
దీంతో రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ ఇలా వరుస సినిమాలు చేసి అనతి కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తున్న రష్మిక.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా తన ఫాలోవర్స్ సంఖ్యను 27 మిలియన్ల వరకు తీసుకెళ్లిన ఈ బ్యూటీ.. తాజాగా అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.
మిరిమిట్లు గొలిపే డిజైనర్ దుస్తులను ధరించిన రష్మిక.. ఎద అందాలను హైలైట్ చేస్తూ కిర్రాక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. అలాగే ఈ పిక్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. రష్మిక ఇంత పని చేశాక.. ఇక కుర్రాళ్ళు ఆగుతారా.. ఆమె ఫొటోలపై రకరకాలుగా స్పందిస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు రష్మిక లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.
కాగా, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. అలాగే శర్వానంద్‌కి జోడీగా `ఆడవాళ్లు మీకు జోహార్లు`, హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై` చిత్రాలు కూడా చేస్తోంది.