Rashmika: హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో జెట్ స్పీడ్ కంటే వేగంగా దూసుకుపోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోనే కాదు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిస్తోంది. ఇక తాజాగా మరో బిగ్ ఆఫర్ ఈమెను వరించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
`ఆర్ఆర్ఆర్`తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ కలిసి హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను గత ఏడాది సమ్మర్లోనే ప్రకటించగా.. ఈ సమ్మర్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇక ఈ మూవీలో మొదట అలియా భట్‌ను తీసుకోగా.. ఆమె పలు కారణాల వల్ల తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలు నిజం కాదట.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. `ఎన్టీఆర్ 30`లో యంగ్ టైగర్‌తో రష్మిక రొమాన్స్ చేయబోతోందట. అలియా స్థానంలో మేకర్స్ రష్మికను తీసుకున్నారట. ఇటీవలె ఆమె సంప్రదించి.. అగ్రిమెంట్‌పై సైన్ కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారట. మరి ఈ వార్తే నిజమైతే.. రష్మిక నక్క తోక తొక్కినట్లే అవుతుంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!