Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మరొకరి వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేసి రష్మిక ఫేస్ పెట్టడం జరిగింది. ఈ వీడియోలో రష్మిక చాలా హాట్ గా కనిపిస్తున్నట్లు క్రియేట్ చేశారు. దీంతో ఉన్నట్టుండి రెండు రోజులుగా రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఈ వీడియో చూసి చాలామంది షాక్ అయిపోయారు. ఎక్కడ కూడా అనుమానం రాని రీతిలో మార్ఫింగ్ చేయటంతో.. చాలామంది సెలబ్రిటీల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో అసలు విషయం బయటపడింది. జారా పటేల్ అనే యువతి ముఖాన్ని తొలగించి ఆ స్థానంలో రష్మిక ఫేస్ పెట్టి వీడియో తయారు చేయడం జరిగింది. సెలబ్రిటీల జీవితాలతో టెక్నాలజీ వాడుకొని ఈ రకంగా ఆడుకోవడం పట్ల చాలామంది ఖండిస్తున్నారు. దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కూడా స్పందించారు. వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా రైతుల కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించింది. ఇలాంటి ఫేక్ వీడియో అత్యంత ప్రమాద చర్యగా పేర్కొన్న కేంద్ర మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడానికి రెడీ అయింది.
అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన వారే బాధ్యత వహించాలని తప్పు అని తెలిసిన వెంటనే 36 గంటల్లో తొలగించాలని పేర్కొంది. మరోపక్క తన డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన కూడా స్పందించింది. దీని గురించి మాట్లాడటం చాలా బాధ కలిగిస్తుంది. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న తీరు చూస్తుంటే నాతో సహా ప్రతి ఒక్కరిలో భయమేస్తోంది. ఇటువంటి పరిస్థితులలో మహిళగా అండగా నిలబడ్డ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఇండస్ట్రీకి చెందిన వాళ్లకి ధన్యవాదాలు. ఇలాంటి సంఘటన నేను పాఠశాలలలో లేదా కళాశాలలో జరిగి ఉంటే ఎలా ఎదుర్కొనే దాన్నో ఊహించలేకపోతున్నా అని ట్వీట్ చేయడం జరిగింది.