Ravi teja: పెద్ద త‌ప్పు చేస్తున్న మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌..?

Share

Ravi teja: `క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమాను పూర్తి చేసిన ఆయ‌న‌.. శరత్ మండవ దర్శకత్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` అనే సినిమాను ప‌ట్టాలెక్కించాడు. ఇదే సెట్స్ మీద ఉండ‌గానే నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో `ధమాకా`, సుధీర్ వర్మ డైరెక్ష‌న్‌లో `రావ‌ణాసుర‌`, వంశీ డైరెక్ష‌న్‌లో `టైగర్ నాగేశ్వర రావు` చిత్రాల‌ను అనౌన్స్ చేసేశాడు.

వీటిలో రావ‌ణాసుర మూవీ విష‌యానికి వ‌స్తే.. ఇది ర‌వితేజ కెరీర్‌లో 70వ సినిమాగా రూపుదిద్దుకోబోతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రారంభోత్సవం కార్య‌క్ర‌మం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌ వేదికగా జ‌ర‌గ‌బోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ లేడీ విల‌న్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ట‌. ఈ రోల్ కోసం హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో యూత్‌ను ఆక‌ట్టుకున్న బ్యూటీ ద‌క్ష న‌గార్క‌ర్‌ను తీసుకుందామ‌ని సుధీర్ వ‌ర్మ చెప్ప‌గా ర‌వితేజ అందుకు ఓకే చెప్పాడ‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని.. విల‌న్‌గా న‌టించేందుకు ద‌క్ష వెంట‌నే ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే ర‌వితేజ పెద్ద త‌ప్పు చేసిన‌ట్టే అవుతుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే, ఓ అందాల భామ‌ను విల‌న్‌గా చూపించ‌డం ఎంతో క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఇందులో ఏ మాత్రం బెడిసి కొట్టినా సినిమా మొత్తంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలోనే లేడీ విల‌న్ క్యారెక్ట‌ర్‌కు ద‌క్ష వంటి హాట్ బ్యూటీ సెట్ కాద‌ని అంటున్నారు.


Share

Related posts

నాని మళ్ళీ మొదలుపెట్టేశాడు!

sowmya

Samantha : సమంత వల్లే శాకుంతలంకి అలా జరిగిందా..?

GRK

గంగోత్రిలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అందానికే అసూయ పుట్టాలేమో..

Muraliak