NewsOrbit
Entertainment News సినిమా

Ravi Teja: యంగ్ హీరోతో మల్టీస్టారర్ సినిమాకి రెడీ అయిన రవితేజ..?

Share

Ravi Teja: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ మహారాజా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. పాండమిక్ తర్వాత చిరంజీవితో పాటుగా ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోగా రవితేజ ఫుల్ బిజీగా ఉన్నారు. గత ఏడాది తడాఖా ఈ ఏడాది స్టార్టింగ్ లో “వాల్తేరు వీరయ్య”తో రెండు విజయాలు ఖాతాలో వేసుకున్నారు రవితేజ ఇటీవల… ఏప్రిల్ 7వ తారీకు “రావణాసుర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. “రావణాసుర” ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మల్టీ స్టారర్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Mass Raja Ravi Teja To Join Forces With THIS Hero For A Multistarrer By National-Award Winning Director! - Filmibeat

ఈ క్రమంలో రవితేజ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవితో “వాల్తేరు వీరయ్య” నటించగా ఇప్పుడు మరో మల్టీస్టారర్ ప్రాజెక్టు.. చేయటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయటానికి రవితేజ రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫస్ట్ సినిమా కలర్ ఫోటోతో నే ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకోవటం జరిగింది. ఈ సినిమాకు ప్రాంతీయ మూవీగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ మూవీ కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నారు. రవితేజ, శర్వానంద్ లతో సూపర్ మల్టీస్టారర్ కథ చేసేందుకు స్క్రీప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారట. ఆల్ రెడీ కొద్ది భాగం రవితేజకి స్క్రిప్ట్ వినిపించగా ఓకే చెప్పడం జరిగిందంట.

Ravi Teja to do one more multi starrer - Mass Maharaja, Multirer, Ravi Teja, Sharwanand |

శర్వానంద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీంతో స్క్రిప్ట్ మరింత ముందుకి తీసుకెళ్లినట్టు త్వరలోనే ఫైనల్ వర్షన్ ఇద్దరు హీరోలను కూర్చోబెట్టి వినిపించి ఆ తర్వాత అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని జీ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత… సందీప్ రాజ్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్లు సమాచారం.


Share

Related posts

Pawan Trivikram: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి మరోసారి డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్..??

sekhar

ఈ సినిమాలకి అనుమతులు లేవా ..?

GRK

Venkatesh : విక్టరీకి ఓటీటీ కలిసొస్తుందా..?

GRK