వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమేకాక తన కెరియర్ కి శుభారంభాన్ని “క్రాక్” సినిమా ద్వారా అందించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన “క్రాక్” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాక సినిమా వ్యాపారంపై ప్రముఖులకు ఉన్న గందరగోళ వాతావరణాన్ని తొలగించింది. భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు రవితేజ అభిమానులు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రాజెక్టు మొదలు పెట్టడానికి రవితేజ రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్టులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేస్తున్నారు. కాగా స్క్రిప్టు పరంగా సినిమాలో కచ్చితంగా లిప్ లాక్ పెట్టే సన్నివేశం ఉండటంతో మొదటిలో ససేమిరా అన్న రవి తేజ తాజాగా ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే సీనియర్ హీరోల సినిమాలలో లిప్ లాక్ సన్నివేశాలు పట్ల సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. మన్మధుడు 2 సినిమాలో నాగార్జున పెట్టిన లిప్ లాక్ సన్నివేశాలకు ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలుసు. దీంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొదటిలో వద్దని భావించిన రవితేజ.. తాజాగా కిలాడీ కోసం రిస్క్ చేయటానికి లిప్ లాక్ పెట్టడానికి రెడీ అయినట్టు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?