సినిమా

Ravi Teja Son: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ర‌వితేజ త‌న‌యుడు.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Share

Ravi Teja Son: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రైండ్ లేక‌పోయినా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ర‌వితేజ‌.. ఐదు ప‌దుల వ‌య‌సులోనూ వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ర‌వితేజ త‌న‌యుడు మహాధన్ భూపతి రాజు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌.

గ‌తంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెర‌కెక్కించిన `రాజా ది గ్రేట్`లో మహాధన్ న‌టించారు. ఇందులో ర‌వితేజ పాత్ర‌ను అత‌డు చేశాడు. అయితే ఇప్పుడు మ‌హాధ‌న్ హీరోగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడంటూ నెట్టింట జోరుగా వార్తలు వ‌స్తున్నాయి.

కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా మ‌హాధ‌న్ డ‌బ్యూ ఉండ‌బోతోంద‌ని.. ఈ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రూవిపూడి తెర‌కెక్కించ‌బోతున్నార‌ని తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి ఈ వార్త ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే.. శరత్ మండవ దర్శకత్వంలో ఈయ‌న న‌టించిన `రామారావు ఆన్ డ్యూటీ` జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అలాగే టైగర్ నాగేశ్వర రావు, రావణాసుర, ధ‌మాకా అనే సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ ఆయ‌న చేతిలో ఉన్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.


Share

Related posts

ఈ హీరోయిన్ కి పెళ్లి అవుతుందని తెలిస్తే కుర్రాళ్ళ మతులు పోతాయి!!

Naina

శ్యామ్ సింగరాయ్ కి తప్పడం లేదు.. ఏం చేద్దాం మరి ..?

GRK

Sai Dhanshika New HD Stills

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar