Ravi Teja: వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో గత ఏడాది లాక్ డౌన్ సమయంలో థియేటర్ లో ఓపెన్ అయిన తర్వాత ఎవరో సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు రాని ఈ సమయంలో రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా “క్రాక్” సినిమా రిలీజ్ చేసి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు. కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రానీ పరిస్థితి ఉన్నట్లు అప్పట్లో ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ నటులు సినిమా థియేటర్ యాజమాన్యం భావించిన సమయంలో క్రాక్ రిలీజ్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సినిమా వ్యాపారానికి దాకా లేదని అందరికీ భరోసా కల్పించారు రవితేజ. క్రాక్ సినిమా రాకముందు వరకు రవితేజ ఫుల్ ఫ్లాపుల్లో ఉన్నాడు.
ఈ సినిమా హిట్ అవడంతో రవితేజని ఇండస్ట్రీకి చెందిన హీరోలు మెచ్చుకోవటం మాత్రమేకాక… సినిమాలు పట్ల ప్రజలకు ఇంకా ప్రేమ ఉందని అర్థం చేసుకున్నారు. దీంతో మంచి జోరు మీదున్న రవితేజ ప్రస్తుతం “కిలాడి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ విషయంలో రవితేజ మంచి స్పీడ్ మీద ఉన్నారట. ఒకపక్క కరోనా నిబంధనలు కఠినంగా అమలు అవుతున్నాయి కానీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేయటం మాత్రమే కాక కేవలం సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Read More: Raviteja: రవితేజ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్..!!
ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా అనుకున్న టయానికి రిలీజ్ చేయాలని రవితేజ సినిమా నిర్మాతలు డిసైడ్ అవ్వడం జరిగిందట. కేవలం కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మినహా దాదాపు ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగాయట. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో దాదాపు 60 కోట్లకు పైగా తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.