Ravi Teja: `క్రాక్`తో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.. ఇటీవల `ఖిలాడి` మూవీతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయినా వెనక్కి తగ్గని రవితేజ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు.
ఈయన ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ధమాకా` ఒకటి. డబుల్ ఇంపాక్ట్ అనేది ట్యాగ్ లైన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు భీమ్స సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా రవితేజ షూటింగ్ లొకేషన్ లో తీసిన స్టిల్ ఒకటి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. షూటింగ్ బ్రేక్ లో రవితేజ ఛైర్‌పై కూర్చొని తన స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను చూసుకుంటూ బిజీ బిజీగా ఉండటం ఈ స్టిల్‌లో చూడొచ్చు. ఆకట్టుకుంటున్న ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, ఈ మూవీతో పాటు రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ`, `రావణాసుర` అనే చిత్రాలనూ చేస్తున్నాడు. వీటిల్లో రామారావు ఆన్ డ్యూటీ మూవీ షూటింగ్ ఫినిష్ అవ్వగా.. త్వరలోనే రావణాసుర సెట్స్ మీదకు వెళ్లనుంది.
https://www.instagram.com/p/CaPuP3XMUUB/?utm_source=ig_web_copy_link
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!