Ravi Teja: “క్రాక్” సినిమా రాకముందు వరకు మాస్ మహారాజా రవితేజ వరస ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయములో లాంగ్ గ్యాప్ ఇచ్చి “రాజా ది గ్రేట్” సినిమా తో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన రవితేజ.. మళ్లీ వరుస ఫ్లాపులు చూశాడు. అయితే గత ఏడాది సరిగ్గా లాక్ డౌన్ ముగిసిన తర్వాత థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత రవితేజ “క్రాక్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులను సృష్టించింది.
రవితేజ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్ కలెక్షన్లు రావడం మాత్రమే కాక .. కరోనా టైం లో సినీ వ్యాపారానికి దెబ్బ అనుకున్న టైం లో మంచి బిజినెస్ చేసింది “క్రాక్” సినిమా. ఈ సినిమా తర్వాత వరుస బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్న రవితేజ .. గతంలో తనకు “భద్ర “సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి ని తాజాగా లైన్ లో పెట్టినట్లు ఫిలిం వర్గాలలో లేటెస్ట్ టాక్. మేటర్ లోకి వెళ్తే అదిరిపోయే మాస్ నేపథ్యం కలిగిన స్టోరీ ఇటీవల బోయపాటి రవితేజకి ఇటీవల వినిపించినట్లు, అంతా ఓకే అయినట్లు, వచ్చే ఏడాది వేసవి కాలంలో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం బోయపాటి.. బాలకృష్ణ “అఖండ” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ తో చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భద్ర.. బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. రవితేజ మాస్ యాక్షన్ తో పాటు మీరా జాస్మిన్ నటన సినిమాకే హైలెట్ అయ్యింది. యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ కథతో బోయపాటి అదిరిపోయే టేకింగ్ “భద్ర” ని మర్చిపోలేని రీతిలో రవితేజ కెరీర్లో చిన్న స్థాయి విజయాన్ని నిలిపింది. ఇలాంటి తరుణంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో రవితేజ అభిమానులు .. హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.