Raviteja: అందరు హీరోల మాదిరిగానే మాస్ మహారాజా రవితేజ కూడా పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు కమిటైన సినిమాలో కొన్నిటిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకే ఓ సినిమాను బహుభాషా సినిమాగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ఖిలాడి సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెన్ స్టూడియోస్ ఖిలాడి సినిమాను నిర్మించింది. ఇదే సంస్థ మొదటిసారి రవితేజ సినిమాను బాలీవుడ్లో రిలీజ్ చేసింది.
ఖిలాడి రిలీజ్ కాకముందు అందరీలోనూ భారీ అంచనాలున్నాయి. అది క్రాక్ సినిమా ప్రభావమే. మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న రవితేజ ఒక్కసారిగా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టారు. అరడజను సినిమాలు చేస్తున్న మాస్ మహారాజా పెద్ద గ్యాప్ లేకుండానే షూటింగ్ పూర్తి చేసేస్తున్నారు. ఇక ఖిలాడి సినిమాతో బాలీవుడ్ మార్కెట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలనుకున్న ఆయనకు అక్కడ పెద్ద షాకే తగిలింది. తెలుగులోనే ఈ సినిమా అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ ఫ్లాప్ టాక్‌తో ముగిసింది.
Raviteja: మేకర్స్ కన్ఫ్యూజన్లో పడ్డారట.
ఇక హిందీలో ఈ సినిమాను పట్టించుకున్న వాళ్ళెవరూ లేకపోవడం ఆసక్తికరం. దాంతో రవితేజకు పాన్ ఇండియా స్థాయి క్రేజ్ వస్తుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి. అనవసరంగా అయినా ఖిలాడి హిందీలో రిలీజ్ చేద్దామా అని మేకర్స్ కన్ఫ్యూజన్లో పడ్డారట. ఈ సినిమా ప్రభావం ఇటు తెలుగులో అటు బాలీవుడ్లో రవితేజ నుంచి రాబోయో సినిమాల మీద బాగానే పడనుందని చెప్పుకుంటున్నారు. కాగా, ఇప్పుడు రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వర రావు, రావణాసుర సినిమాలను చేస్తున్నారు మాస్ మహారాజ. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.