Tiger Nageswara Rao Release Date: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాండమిక్ తర్వాత అత్యధికంగా సినిమాలు చేస్తున్న ఈరోజు ఇద్దరే ఇద్దరు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి మరొకరు మాస్ మహారాజు రవితేజ. ఇద్దరు వరుస పెట్టి సినిమాలు చేస్తూ సినిమా పై నమ్ముకున్న వారికి పని కల్పించే రీతిలో… దూసుకుపోతున్నారు. ఇటీవల మీ ఇద్దరి కలయికలో వాల్తేరు వీరయ్య అనే సినిమా కూడా రావడం జరిగింది. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకు ముందు డిసెంబర్ నెలలో “ధమాకా” సినిమాతో రవితేజ మంచి హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ కావడం జరిగింది. కాగా ఇప్పుడు వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా రవితేజ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నా ఈ సినిమా రవితేజ కెరియర్ లో తొలి పాన్ ఇండియా సినిమా. గాయత్రీ భరద్వాజ్, నుపూర్ సనన్ హీరోయిన్ లుగా చేస్తున్నారు. రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తుంది. వైజాగ్ ఇంకా పరిసర ప్రాంతాలలో.. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. అక్టోబర్ 20వ తారీకు రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ తో పాత్ర పోషిస్తుంది. 1970 వ కాలంలో స్టువర్టుపురంలో పాపులర్ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది మనందరికీ ప్రత్యేకమైనది.. అక్టోబర్ 20వ తారీకు “టైగర్ నాగేశ్వరరావు”… ఏప్రిల్ ఏడవ తారీఖు “రావణాసుర” సినిమా రిలీజ్ కాబోతున్నట్లు రవితేజ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20వ తారీకు వేట ప్రారంభం కాబోతున్నట్లు సినిమా యూనిట్ టైగర్ నాగేశ్వరరావు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ రవితేజ సినిమాలు విడుదలవుతూ ఉండటంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!