Ravi Teja: ఆర్.బి.చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమాలో హీరోయిన్ పాత్రలో… ఇలియానా తెలుగులో ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ గోవా బ్యూటీ రెండో సినిమా పోకిరితో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారి పెద్ద హీరోలతో వరుస ఆఫర్లు అందుకుని ఇక సౌత్ ఇండస్ట్రీ లోనే తిరుగులేని క్రేజీ హీరోయిన్ గా అవతరించింది. చేతినిండా సినిమాలు వస్తూ ఉండటంతో.. ఇలియానా నా చౌతి ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయింది.
అయితే అక్కడ ప్రారంభంలో అవకాశాలు అందుకుని రాగానే తర్వాత కెరీర్ పరంగా డౌన్ ఫాల్ రావడంతో .. మళ్లీ లైఫ్ ఇచ్చిన సౌత్ లోకి అడుగుపెట్టి అవకాశాలు అందకుండా గానీ పెద్దగా విజయం సాధించలేదు. దీంతో సోషల్ మీడియాలో భారి అందచందాలు చూపిస్తూ ఫోటోలు రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఇలియానా కి కెరియర్ పరంగా బిగ్ హెల్ప్ రవితేజ చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా రవితేజ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ కోసం డైరెక్టర్ కి రవితేజ హీరోయిన్ ఇలియానా ని సూచించినట్లు.. వాళ్లు కూడా ఒకే అన్నట్లు టాక్. సినిమాకి ఈ సాంగ్ హైలెట్ గా ఉంటుందని దీంతో ఇలియానాతో రవితేజకి మంచి బాండింగ్ ఉండటంతో.. ఆమెకు అవకాశం ఇచ్చినట్లు.. ఇండస్ట్రీ టాక్. గతంలో రవితేజతో కతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ తరుణంలో “రామారావు అన్ డ్యూటీ” అనే తన కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రవితేజ ఇలియానా ని తీసుకున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.