Venkatesh Raviteja: ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఉన్న సమయంలో వెంకటేష్ కూడా మంచి పోటీ ఇస్తూ కుటుంబ ప్రేక్షకులు సినిమాలు చేస్తూ.. అందరూ మెచ్చే హీరోగా రాణించాడు. అయితే క్రమేణా వయసు మీదపడటంతో సీనియర్ హీరో కావటంతో.. చాలా తెలివిగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో రాణిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ప్రజెంట్ ఉన్న హీరోలలో మల్టీస్టారర్ సినిమాలకు వెంకటేష్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తో శ్రీకారం చుట్టారు. మహేష్ బాబుతో వెంకీ నటించిన ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నాగచైతన్య ఇంకా చాలా మంది హీరోలతో వెంకటేష్ నటించడం జరిగింది.
ఇప్పుడు ఇదే తరహాలో మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. సోలో గా ఒక సినిమా హిట్ కొట్టిన గాని.. రవితేజ అనేక ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మల్టీస్టారర్ సినిమాలకి రవితేజ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అందువల్లే ముందుగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో… ఒకటి ఓకే చేయడం మాత్రమే కాదు త్వరలోనే నందమూరి బాలయ్య బాబు తో కూడా మల్టీస్టారర్ సినిమా చేయడానికి రవితేజ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఇద్దరు స్టార్ హీరోలతో మాత్రమే కాదు ఇంకా చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి రవితేజ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రవితేజ ఒకపక్క సోలో సినిమాలు కూడా ఎప్పటిలాగానే ఒప్పుకుంటూ సరికొత్తగా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రవితేజ చాలా మల్టీస్టారర్ సినిమాలు చేయడం జరిగింది. అయితే అప్పుడు అంతగా క్రేజ్ లేదు. మెగాస్టార్ చిరంజీవితో అన్నయ్య… శంభో శివ శంభో. ఇంకా చాలా సినిమాలు చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు మల్టీస్టారర్ కథలకు రవితేజ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.