న్యూస్ సినిమా

Raviteja: రవితేజ ఫుల్ కిక్కు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు..క్రాక్ సినిమాను మర్చిపోవాల్సిందే

Share

Raviteja: మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను రవితేజ సినిమాలు ఏ రేంజ్‌లో ఆకట్టుంటాయో తెలిసిందే. అలాంటి రవితేజ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే అభిమానులకు ఎంత నిరాశగా ఉంటుందో. అది కూడా వరుసగా నాలుగైదు సినిమాలు. రాజా ది గ్రేట్ తర్వా రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. దాంతో ఈ మాస్ మహారాజ కెరీర్ అయిపోయిందనే టాక్ మొదలైంది. కానీ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో రవితేజకు సాలీడ్ హిట్ ఇచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు.

 

raviteja khiladi is going to crack the records
raviteja khiladi is going to crack the records

దాంతో రవితేజ రేంజ్ తగ్గలేదని ప్రూవ్ అయింది. ఇక వరుసగా తన స్టైల్లో ఉండే సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఖిలాడి, రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌ను సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు రవితేజ. త్వరలో ఖిలాడి సినిమాతో రాబోతున్నాడు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడు. హీరోయిన్స్‌గా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అర్జున్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Raviteja: రవితేజను ఇప్పట్లో ఆపే సత్తా ఎవరికీ లేదని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ, డింపుల్ హయాతిల మీద ఫుల్ కిక్కు అనే మాస్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ చూస్తే రవితేజ మాస్ యాక్షన్, డింపుల్ గ్లామర్ హైలెట్ కానుందని అర్థమవుతోంది. క్రాక్ సినిమాలో రవితేజ ఫైరింగ్ పర్ఫార్మెన్స్‌తో పాటు శృతిహాసన్ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. అంతకంటే హైలెట్ ఎలిమెంట్స్ ఖిలాడి సినిమాలో ఉన్నాయట. ఈ సినిమా క్రాక్ కంటే భారీ హిట్ సాధిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కూడా భారీ హిట్ సాధిస్తే ఇక రవితేజను ఇప్పట్లో ఆపే సత్తా ఎవరికీ లేదని అంటున్నారు.


Share

Related posts

తెలంగాణ తల్లి ప్రార్థన గీతం విడుదల చేసిన మంత్రి కేటీఆర్…!

arun kanna

`గుణ 369` సెన్సార్ పూర్తి

Siva Prasad

మహేష్ బాబు డైరెక్టర్ తో రామ్ చరణ్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar