Ramarao on duty: కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” రిలీజ్ డేట్ అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది. జూన్ 17 వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు రవితేజ పోస్టర్ నీ విడుదల చేసి ప్రకటించడం జరిగింది. విడుదలైన పోస్టర్ లో … భారీ వాహనాలు అడవి గుండా వెళ్తున్నట్లు చూపించడం జరిగింది. దీంతో సినిమా స్టోరీ ఏంటో అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలే కిలాడి సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్దగా అలరించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బొక్క బోర్లా పడింది. దీంతో ఇప్పుడు రవితేజ అభిమానులు “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అదేసమయంలో వేణు తొట్టెంపూడి, నాజర్, పవిత్ర లోకేష్, తనికెళ్ళ భరణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించడం జరిగింది. చెరుకూరి సుధాకర్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాస్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు యాక్షన్ థ్రిల్లర్ తరహాలో సన్నివేశాలు సినిమా లో ఉండనున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 17 వ తారీకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా నేడు ప్రకటించారు. ఇదిలా ఉంటే జూన్ మాసంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగే అవకాశమున్నట్లు…ఫోర్త్ వేవ్ రానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో .. రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా నా ఫోన్ మాసంలో మాత్రం కేసులు లేకపోతే.. పరిస్థితి సాధారణంగా ఉంటే ఇండస్ట్రీ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలు ముందుగానే రిలీజ్ కానున్నట్లు టాక్. అయితే అందరి విషయం అలా ఉంటే రవితేజ మూవీ రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. పాండమిక్ సీజన్ లలో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా సినిమాలు విడుదల చేసిన హీరో రవితేజ. కరుణ వచ్చిన ప్రారంభంలో లాక్ డౌన్ తర్వాత సినిమా ధియేటర్ల వ్యాపారం పడిపోయింది అనుకుంటున్న సమయంలో తన క్రాక్ సినిమా విడుదల చేసి అదిరిపోయే విజయాన్ని రవితేజ అందుకున్నాడు. మొన్న కూడా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత… కిలాడి రిలీజ్ చేశారు. ఏదిఏమైనా బయట పరిస్థితులు ఎలా ఉన్నా రవితేజ మాత్రం తన సినిమాలను విడుదల చేయడంలో దూసుకుపోవడం విశేషం.