మాస్ మహారాజా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రవితేజ గత చిత్రం `అమర్ అక్బర్ ఆంటోని` ఎప్పుడో విడుదలైన తదుపరి సినిమాను రావడానికి సమయం పట్టేలానే ఉంది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న `డిస్కోరాజా` తదుపరి షెడ్యూల్ మే 27న ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. గతంలో రవితేజతో `డాన్‌శీను`, `బలుపు` చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవితేజ సినిమా చేయబోతున్నాడని టాక్. అయితే ఇది ఇంకా చర్చల దశలో ఉందని.. అంతా ఓకే అయితే రవితేజ త్వరలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడని అంటున్నాయి సినీ వర్గాలు.
previous post
next post