Subscribe for notification
Categories: సినిమా

RC 15: శంకర్.. రామ్ చరణ్ తేజ్ సినిమా రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్..??

Share

RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరియర్ లో ఈ సినిమా 15వ ది కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నది. టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో… చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా… నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మూడు డిఫరెంట్ పాత్రలలో కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అందులో ఒక క్యారెక్టర్ ముఖ్యమంత్రి పాత్ర అని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇటీవల ఈ ఏడాది చివరిలో లేదా దసరా పండుగకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

తాజా అప్ డేట్ ప్రకారం… ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సమ్మర్ కి మార్కెట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఈ రీతిగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమల్లి పరిసర ప్రాంతాల చుట్టూ జరుగుతోంది. ఫస్ట్ టైం సెన్సేషనల్ డైరెక్టర్ మెగా హీరోతో సినిమా చూస్తూ ఉండటం తో.. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share
sekhar

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

12 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

13 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

25 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago