SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా మూవీ సర్కారు వారి పాట మరి కొన్ని రోజులలో విడుదలవ్వబోతోంది. ఇక విడుదలకు ముందే ఈ సినిమా ప్రభంజనాలు సృష్టిస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ 24 గంటల్లోనే టాలీవుడ్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. తాజాగా ఈ సినిమా USలో సరికొత్త రికార్డు నమోదు చేయనుంది. విషయం ఏమంటే, సర్కారు వారి పాట USలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 603 లొకేషన్స్ లో విడుదల కాబోతుందని చిత్రం యూనిట్ ప్రకటించింది. పాన్ ఇండియా సినిమాలు తప్పించి ఓ తెలుగు మూవీ ఈ రేంజ్లో విడుదలవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
SVP: విడుదలకు ముందు ఈ చిత్రం నెలకొల్పిన రికార్డులు ఇవే
ఓవర్సిస్లో 1 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలే ఎక్కువగా ఉండడం ఓ రికార్డు. తాజాగా ఈ సినిమాతో మహేష్ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే విడుదల అయిన పాటలు రికార్డులు నెలకొల్పాయి. మొదట విడుదలైన కళావతి సాంగ్ 150 మిలియన్‌పైగా వ్యూస్ రాబట్టి, యూట్యూబ్ ని షేక్ చేసింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అన్ని సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టుకోవడం విశేషం. ఇక ట్రైలర్ అయితే దుమ్ముదులిపింది. 24 గంటల్లోనే 26 మిలియన్ వ్యూస్, 1.2 మిలియన్ లైక్స్‌తో అత్యధిక మంది చూసిన ట్రైలర్‌గా నిలిచింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం
దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మహేష్ చెప్పే డైలాగ్‌లు మాస్ సర్కిల్ లో చక్కెర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ‘ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు’ అని చెప్పే డైలాగ్ యువతను అమితంగా ఆకట్టుకుంది. మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే యూఎస్ బుక్సింగ్ ప్రారంభమవ్వడం విశేషం. విడుదలకు దాదాపు 15 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం మామూలు విషయం కాదని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరొక వైపు మహేష్ కెరీర్లో మే నెలలో విడుదలైన గత చిత్రాలను పరిశీలించినట్టయితే నాని, నిజం, బ్రహ్మోత్సవం చిత్రాలు డిజాస్టర్‌గా మిగిలిపోవడం కొసమెరుపు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సంగతి తేలిపోనుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!