Rekha boj: నవంబర్ 19 వ తారీకు గుజరాత్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ టీం ఇండియా జట్ల మధ్య జరగబోతున్న నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భారత్ మొదటి నుండి జైత్రయాత్ర సాగిస్తూ ఉంది. ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్లు పట్టికలో టాప్ లో ఉంది. ఆల్రెడీ ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాను.. టీమిండియా ఒకసారి ఓడించింది. దీంతో ఇప్పుడు ఈ రెండు టీమ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది.
ఫైనల్ లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2011లో ధోని సారథ్యంలో అప్పట్లో టీమ్ ఇండియా గెలిచింది. మళ్లీ ఇప్పుడు ఫైనల్ కి ఇండియా వెళ్ళటంతో ఈసారి కూడా గెలవాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్ లో నగ్నంగా ఉంటాను అంటూ ఓ తెలుగు నటి ఓపెన్ చాలెంజ్ చేసింది. ఆమె మరెవరో కాదు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే రేఖా బోజ్. మాంగల్యం, స్వాతి చినుకు, సంధ్య వేళలో, రంగీలా కలయా తస్మై నమః అనే సినిమాలలో రేఖా బోజ్ హీరోయిన్ గా నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత తెలుగు సినిమాలలో అనేక పాత్రలు చేసిన ఫలితం మాత్రం దక్కలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటది. తాజాగా ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ కీ చేరుకోవడంతో.. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్ లో నగ్నంగా కనిపిస్తా అంటూ రేఖా బోజ్ సంచలన ప్రకటన చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.