అది జూనియర్ పవర్ స్టార్ రక్తంలోనే ఉంది…

అది జూనియర్ పవర్ స్టార్ రక్తంలోనే ఉంది…

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసున్నా విడిపోయినా మీడియాకి ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా పవన్ నుంచి విడిపోయాక, రేణు ఎక్కడ కనిపించినా… ఏ మీడియా ముందుకి వచ్చినా పవన్ గురించి కచ్చితంగా ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రతిసారి ఇలాంటి క్వేషన్స్ వినే రేణు ఈసారి కూడా ఒక ప్రశ్న ఎదురయ్యింది, కాకపోతే అది పవర్ స్టార్ నటవారసత్వానికి సంబంధించినది కావడం విశేషం.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అకిరా సినిమాల్లోకి వస్తాడా అని హోస్ట్ అడగగా, దానికి సమాధానంగా రేణు దేశాయ్.. ప్రస్తుతం అకిరా అందరి టీనేజ్ కుర్రాల్లాగే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, తనకి సినిమాల్లోకి రావాలనిపిస్తే తప్పక వస్తాడు. అకిరా పెద్దనాన్న ఒక మెగాస్టార్, నాన్న స్వయంగా ఒక పవర్ స్టార్, అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… ఇలాంటి ఫ్యామిలీ ఉన్న వాళ్లు ఏదైనా చేయగలరు . అకిరాకి హీరో అవ్వాలని ఉంటె కచ్చితంగా సపోర్ట్ చేస్తాను, జూనియర్ పవర్ స్టార్ ని చేస్తానని చెప్పింది. అలాగే ఫ్యూచర్ లో మెగా ఫ్యామిలీలో ఎవరితో అయినా సినిమా చేస్తారా అని అడిగితే, తన ఇంట్లోనే మరో మెగా హీరో ఉన్నాడు కదా అతనితోనే సినిమా చేస్తానని చెప్పి క్లారిటీ ఇచ్చింది.

రేణు మాటలు విన్న మెగా అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ లేని లోటు అకిరా తీరుస్తాడంటూ మెగా ఫాన్స్ హోప్ తో ఉన్నారు. ఇప్పటికైతే అకిరా చిన్న పిల్లడు కాబట్టి కొంచెం టైం తీసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు. అదే జరిగితే మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ వారసుడిగా అకిరా ఎంట్రీ అదిరిపోయే రేంజులో జరగాలి.