పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి మరియు పిల్లల గురించి అనేక సంగతులు తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో జరిగే అనేక విషయాల గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంది. అటువంటి రేణుదేశాయ్ తాజాగా కామెడీ షో జబర్దస్త్ లో కమెడియన్ ని పొగడ్తలతో ముంచెత్తింది.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పిల్లలతో ఇంట్లోనే ఉన్న రేణుదేశాయ్ ఇంస్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ అభిమాని “బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 4” లో మీరు హోస్ట్ గా వ్యవహరించ బోతున్నట్లు… వార్తలు వస్తున్నాయి వాటిలో నిజం ఎంత అని ప్రశ్నించారు. సమస్య లేదు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. యాంకర్ గా చేయాలంటే మంచి అనుభవం ఉండాలని చెప్పుకొచ్చింది. ఈ తరుణంలో తెలుగులో యాంకరింగ్ సుమ మరియు సుడిగాలి సుధీర్ మంచి ఎనర్జిటిక్ యాంకర్స్ అంటూ పొగిడింది. దీంతో సుడిగాలి సుధీర్ అభిమానులు థాంక్స్ మేడం అని రేణు పొగడ్తలకు రిప్లై ఇచ్చారు. ఇదే టైం లో త్వరలో ఓ సినిమాలో రీ-ఎంట్రీ ఇవ్వ బోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.