Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే. బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మరాటి అమ్మాయి మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్ ప్రేమలో పడటం జరిగింది. ఆ తర్వాత సహజీవనం చేసి 2009లో అకీరా నందన్ సాక్షిగా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. సరిగ్గా 2011వ సంవత్సరంలో ఇద్దరు విడిపోవడం జరిగింది. అప్పటి నుండి తన ఇద్దరు పిల్లలతో రేణు దేశాయ్.. పూణేలో ఉంటూ ఉంది. దాదాపు పది సంవత్సరాల నుండి పూణేలోనే తన కుటుంబ సభ్యులతో ఉంటుంది. కొన్నాళ్ల పాటు ఇంటికి పరిమితమైన రేణు దేశాయ్.. తర్వాత బుల్లితెరలో రాణించటం జరిగింది. కొన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ లకు చెందిన ప్రోగ్రామ్ లలో కూడా జడ్జిగా వ్యవహరించడం జరిగింది.
రీసెంట్ గా రవితేజ కొత్త సినిమా “టైగర్ నాగేశ్వరరావు” లవణం అనే పాత్ర చేయడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో హీరోయిన్లతో పాటు రేణు దేశాయ్ కూడా జరుగ్గా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతోపాటు తన వ్యక్తిగత విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన సమయంలో అకీరా, ఆధ్య ఇద్దరూ చిన్న పిల్లలు. దీంతో రెండో పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఎంతో ఒత్తిడి చేసేవాళ్ళు.
అయితే కొంతకాలం తర్వాత రెండో పెళ్లికి ఒప్పుకోవటం జరిగింది. కొన్ని రోజులకు నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పుడు ఆద్య వయసు 7 సంవత్సరాలు. అయితే పెళ్లి చేసుకుంటే ఆయనతోపాటు ఆధ్యాకి కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అది చాలా కష్టమనిపించి రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అయితే అకీరా ఎవరైనా వ్యక్తి నచ్చితే రెండో.. పెళ్లి చేసుకో అని ఇప్పటికీ కూడా చెబుతుంటాడు రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాను అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.