Renu Desai Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో జనాకర్షణ కలిగిన వ్యక్తి. సినిమాల పరంగా ఎంత సంచలనం సృష్టించారు. ఇక రాజకీయంగా ఎలక్షన్ లో ఓడిపోయినా గాని.. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. జనసేన పార్టీ అధినేతగా పవన్ తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయ ముఖచిత్రాలను మార్చేసే పరిస్థితిలో ఉంటాయి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ప్రత్యర్ధులు విమర్శించే విషయంలో కేవలం భార్యలు గొడవ తప్ప మరో టాపిక్ వారికీ ఉండదు. ఇదిలా ఉంటే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కి పవన్ అభిమానులకి ఎప్పుడూ సోషల్ మీడియాలో గొడవలు అవుతూనే ఉంటాయి అనీ అందరికి తెలుసూ.
ఇటీవలా ఏప్రిల్ 7వ తారీకు అకిరా నందన్ పుట్టినరోజు సమయంలో పవన్ అభిమానులు కొద్దిగా అతిగా చేసిన వ్యాఖ్యలకు రేణుదేశాయ్ ఫుల్ సీరియస్ అయింది. ఇటువంటి పరిస్థితులలో ఒక మహిళా సామాజికవేత్త రేణుదేశాయ్… పవన్ కళ్యాణ్ విడాకులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మన సమాజంలో భార్యాభర్తల విషయంలో తప్పు జరిగి విడిపోతే ఖచ్చితంగా సమాజం మొత్తం స్త్రీ వేపే వేలు చూపించి ప్రశ్నిస్తూ ఉంటది. ఇది చాలా అన్యాయం. ఇలా సమాజం మాట్లాడటం వల్లే.. స్త్రీలు మానసికంగా ఎంతో వేదనకు గురవుతారు.. అంటూ సమంత నాగచైతన్య విడాకులు ఇంకా రేణుదేశాయ్.. పవన్ కళ్యాణ్ విడాకులు గురించి ఆమె మాట్లాడారు. ఈ క్రమంలో రేణుదేశాయ్.. ఒక విధంగా పవన్ కళ్యాణ్ ని జైలు శిక్ష నుండి తప్పించింది అని తెలుపారు. పవన్ కళ్యాణ్ ఓ గుడిలో లేదా ఇంటిలో నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. అని రేణు దేశాయ్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ ఈపాటికి జైల్లో ఉండేవారు.
పవన్ కళ్యాణ్ ని ఓ విధంగా చెప్పాలంటే రేణుదేశాయ్.. జైలు శిక్ష నుంచి కాపాడింది అంటూ ఆ మహిళ సామాజికవేత్త చేసిన వ్యాఖ్యలు వీడియోని రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ “నాకు ఆవిడ ఎవరో అని తెలియదు. ఆవిడ నా గురించి ఎందుకు మాట్లాడారో…నాకు తెలియదు. కానీ మొదటిసారి పబ్లిక్ లో ఎవరో నా తరఫున మాట్లాడటం విని నేను చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెబితే నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయాను అంటారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారు.. నాకు ఈ వీడియో చూసి నా బాధ అర్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు అని ధైర్యం వచ్చింది”అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అటు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతూ ఉంది.