Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా “బద్రి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణు దేశాయ్.. ఆ తర్వాత పవన్ దర్శకత్వంలో “జానీ” సినిమా చేసింది. అనంతరం పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి తర్వాత 2009వ సంవత్సరంలో పవన్ నీ పెళ్లాడిన రేణు దేశాయ్ 2012వ సంవత్సరంలో.. విడాకులు తీసుకోవడం జరిగింది. అప్పటినుండి ఒంటరిగానే ఉంటున్న రేణు దేశాయ్.. గతంలో రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సరిగ్గా 2018వ సంవత్సరములో.. రేణు కి రెండో పెళ్లి కోసం నిశ్చితార్థమైనట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో కొంతమంది గట్టిగా నెగిటివ్ కామెంట్లు చేయడం పెద్ద రబసకు కారణమైంది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా మరోసారి జీవితంలో ఒక తోడు అవసరం అని రేణుదేశాయ్ రీసెంట్ గా ఓ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అనంతరం వేరే పోస్ట్ లో… మీ సోల్ మెట్ నీ వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అంటూ ఓ వీడియో షేర్ చేయడం జరిగింది.
దీంతో రేణు దేశాయ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. సరిగ్గా పవన్ కళ్యాణ్ బర్త్ డే తర్వాత రోజు..రేణు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న నాటినుండి రేణు దేశాయ్ పూణేలో పిల్లలతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటే మంచిదని ఆమె సన్నిహితులు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రెండో పెళ్లి గురించి జీవితంలో ఓ తోడు కావాలి అన్న తరహాలో.. పోస్ట్ చేయడం పెద్ద చర్చకు దారితీస్తుంది.