Pushpa 2: ఐకాన్ స్టార్ బన్నీ నటిస్తున్న “పుష్ప 2” కోసం దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. గత ఏడాది విడుదలైన “పుష్ప” భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీలను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప మొదటి భాగం డైలాగులు పాటలు బన్నీ పెర్ఫార్మెన్స్…నీ భాషలకు ప్రాంతాలకు అతీతంగా చాలా మందిని ప్రభావితం చేయడం జరిగింది. పలు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు క్రీడారంగానికి చెందిన స్టార్ ఆటగాళ్లు ఇంకా అనేక దేశాల అధినేతలు సైతం “పుష్ప” డైలాగులు మీడియా ముందు మాట్లాడి హైలైట్ అయ్యారు.
ఊహించని విధంగా “పుష్ప” మొదటి భాగం విజయం సాధించింది. దీంతో ఇప్పుడు “పుష్ప 2” అదే స్థాయిలో విజయం సాధించాలని డైరెక్టర్ సుకుమార్ తో పాటు బన్నీ.. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ హీరోయిన్ రష్మిక…సెకండ్ పార్ట్ లో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ నెగటివ్ రోల్ కి మరో హీరోయిన్ గతంలో “ఇద్దరమ్మాయిలతో ” సినిమాలో బన్నీతో నటించిన కేథరిన్ తెరిసా ని తీసుకోవడానికి సుకుమార్, బన్నీ డిసైడ్ అయినట్లు సమాచారం.
మొదటి పార్ట్ కంటే ఎక్కువ ట్విస్టులు.. యాక్షన్స్ సన్నివేశాలు “పుష్ప 2″లో ప్లాన్ చేయడం జరిగిందంట. మొదటి పార్ట్ లో లేడీ విలన్ పాత్రలో అనసూయ కనిపించగా సెకండ్ పార్ట్ లో కేథరిన్ నీ సుకుమార్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మొదట పాజిటివ్ పాత్రలో.. సినిమా చివరిలో కేథరిన్ లో నెగిటివ్ షేడ్స్..ట్విస్ట్ ఇచ్చే రీతిలో సుకుమార్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే “పుష్ప 2″లో కేథరిన్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.