RGV: ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గుట్టు రట్టయింది. అవును.. ఇది బయట పెట్టింది మరెవ్వరో కాదు. ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇక రెహమాన్ తో సినిమా అంటే దర్శక నిర్మాతలకు గొడ్డలిపెట్టు వంటిది. ట్యూన్స్ తొందరగా ఇవ్వడని, సంగీతం ఆలస్యం చేస్తాడని.. ఇలా రకరకాల కారణాలతో సినిమాలకు మన దక్షిణాదిన అతగాడిని తీసుకోవడమే మానేశారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ కచేరిలు చేసుకుంటూ ఇండియాలోని సినిమాలకు వేరే వాళ్ల చేత ట్యూన్స్ ఇప్పిస్తున్నాడని అతనిపై తాజాగా సంచలన నిజాలు వెలుగుచూశాయి.
RGV: ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాని చూపిస్తూ, ఏకంగా బాలీవుడ్ మొత్తానికి క్లాస్ పీకిన రాంగోపాల్ వర్మ!
RGV: అసలు రహస్యం ఇదే:
తాజాగా రాంగోపాల్ వర్మ చెప్పిన ఒక రహస్యం ఇప్పుడు రెహమాన్ గుట్టు రట్టు చేసేలా చేసింది. తన బ్రాండ్ పేరుతో ఇతర చిన్న సంగీత దర్శకుల నుంచి ట్యూన్స్ తీసుకొని వారికి డబ్బులిచ్చి అమ్ముకుంటాడన్న షాకింగ్ విషయం బయటపడింది. ఈ విషయమే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తంతు తెలిసిన కొందరు సినీ పండితులు రెహమాన్ ఫేడ్ అయిపోవడానికి కారణం ఆయన ట్యూన్స్ చేయడం మానేయడమేనా అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయన చేసే మ్యూజిక్ మొత్తం ఇతరులవేనని, వారి సంగీతాన్ని తీసుకొని తన పేరు పెడుతున్నాడని ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు.
RGV: ఎన్నడూ లేని విధంగా వెరైటీగా కుక్కతో రామ్ గోపాల్ వర్మ..!!
మరింత సమాచారం ఇదిగో:
మనం ఎంతగానో ఇష్టపడిన ‘జయహో’ పాట ఒరిజినల్ గా రెహమాన్ చేయలేదట. సదరు పాటను ఆలపించిన సుఖఃవీందర్ సింగ్ ఆ పాటకు ట్యూన్ చేసాడట. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లో వచ్చిన ఈ పాట ఎంతగా మన్ననలు పొందిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో దానికి గాను రహమాన్ కు ఆస్కార్ అవార్డు కూడా రావడం కొసమెరుపు. ఈ ట్యూన్ ఇచ్చినందుకు రహమాన్ తన డ్రైవర్ తో సుఖిందర్ సింగ్ కు అక్షరాలా రూ.5 లక్షలు రూపాయిలు పంపాడట. ఈ పాట స్లమ్ డాగ్ మిలియనీర్లోని ‘జయహో’ సాంగ్..’ ఈ సాంగ్ సుఖింద్ చేస్తే రెహమాన్ తన పేరును వాడుకునట్టు వర్మ చెప్పుకొచ్చాడు.