NewOrbit
సినిమా

RGV- Prabhas: ప్రభాస్ సినిమాలో వర్మ నటించబోతున్నాడా.. అసలు విషయం ఏమిటంటే..?

Share

ఇది ప్రభాస్ అభిమానులకు శుభవార్తా లేదంటే చెడువార్తో తెలియదు గాని, సోషల్ మీడియాలో మాత్రం ఇపుడు ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని తెలుగు కుర్రకారు వుండరు. ఒక హీరో స్థాయిలో తెలుగులో మరీ దర్శకుడికైనా అభిమానులు వున్నారు అంటే, అది వర్మనే. సినిమాలు తీయడంలోఎలా అయితే తన మార్క్ ని ప్రదర్శిస్తాడో మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో కూడా అతను అంతే మార్క్ ప్రదర్శిస్తాడు.

#RGV

బేసిగ్గా సినిమాలకు దర్శకత్వం వహించే వర్మ అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో మెరుస్తూ వుంటారు. తాజాగా ఇదే విషయమై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ప్రభాస్ సినిమాలో వర్మ కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలతో మంచి బిజీగా ఉన్నారు. అయితే ఆయన హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా ప్రాజెక్టు K లో రామ్ గోపాల్ వర్మ భాగం కాబోతున్నారనే రూమర్స్ బాగా వినబడుతున్నాయి.

Advertisements
#rgv

ప్రాజెక్ట్ Kలో ఓ చిన్న పాత్ర కోసం ఇటీవలే ఆ చిత్ర నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను సంప్రదించారని, ఈ రోల్ చేసేందుకు RGV మొగ్గు చూపారని మీడియా వర్గాల కధనం. అలాగే వర్మ త్వరలో తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారని టాక్ వినబడుతోంది. ఈ సినిమాలో వర్మ తన నిజ జీవిత పాత్రలో నటించబోతున్నట్లు భోగట్టా. ప్రభాస్ సినిమాలో వర్మ క్యారెక్టర్ పెట్టి పాన్ వరల్డ్ సినిమా గురించి జనం చర్చించుకునేలా చేయడమే టార్గెట్ చేస్తున్నారని హడావుడి చేస్తున్నారు సోషల్ మీడియా జనం. ఇదేగాని నిజమైతే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి నుండి పాన్ వరల్డ్ స్థాయిని అందుకుంటారేమో చూడాలి!


Share

Related posts

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళే….

arun kanna

రామ్ `ది వారియ‌ర్‌`కు అదే మైన‌స్‌.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందో తెలుసా?

kavya N

ఏకంగా తమిళ బిగ్ బాస్ లో ప్రత్యక్ష్యమైన దేత్తడి హరిక…! కమల్ సార్ పక్కన నేను అని గాల్లోకి ఎగిరి గంతేసింది

arun kanna