NewsOrbit
న్యూస్ సినిమా

RGV Varsha: అలా అయితే ఓకే కానీ పెళ్లాంగా వద్దంటూ.. జబర్దస్త్ వర్షపై ఆర్జీవీ కొంటె కామెంట్స్..!

Share

New Year Program: డిసెంబర్ 31వ తేదీ నాడు 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానున్న ‘పెళ్లాం వద్దు.. పార్టీ ముద్దు (Pellam Vaddu Party Vaddu) అనే ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు వైరల్‌గా మారాయి. ఈ న్యూ ఇయర్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్ గోపాల్ వర్మ ప్రోమోలలో హైలెట్ అవుతున్నారు. ఆర్జీవీ మనస్తత్వానికి తగ్గట్టు గానే ఈ ప్రోగ్రాం థీమ్ ఉండటం విశేషం. రామ్ గోపాల్ వర్మ వచ్చారంటే ఇందులో అంతా అడల్ట్, డబుల్ మీనింగ్ కామెంట్లే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇందులో వర్మ జబర్దస్త్ వర్షపై కన్నేయడం.. ఆమెతో కలిసి డాన్స్ చేయడం.. వర్ష కూడా వర్మతో సరదాగా మాట్లాడాలని ప్రయత్నం చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఒక ప్రోమోలో వర్షపై కొంటె కామెంట్స్ కూడా చేశారు ఆర్జీవీ.

జబర్దస్త్ వర్షపై ఆర్జీవీ కొంటె కామెంట్స్

కొద్ది గంటల క్రితం యూట్యూబ్‌లో విడుదలైన పెళ్లాం వద్దు పార్టీ వద్దు ప్రోగ్రాం ప్రోమోలో ఆర్జీవీ(Ram Gopal Varma) ఎంట్రన్స్ ఇస్తూ కనిపించారు. వస్తూవస్తేనే రోహిణి, వర్ష(Jabardasth Varsha) చేతులు పట్టుకొని డాన్స్ చేస్తూ కేక పుట్టించారు. ఆ తర్వాత వర్ష మాట్లాడుతూ.. “మీ వద్దకు నేను ఇలా వచ్చేస్తే నన్ను వదిలేసి వెళ్లిపోతారా?” అని ఆర్జీవీ ని ప్రశ్నించింది. “ఏంటి పెళ్ళాం గానా?” అని ఎదురు ప్రశ్న వేయగానే “హా, అవును” అని వర్ష సమాధానం ఇచ్చింది. దాంతో.. “పెళ్ళాం అనే డెఫినేషనే వద్దు” అని డబుల్ మీనింగ్ కామెంట్లు చేశారు వర్మ. దాంతో ఆటో రాంప్రసాద్, వర్షిణి, ఇంద్రజ ఇలా అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. వర్మ క్యారెక్టర్ ఏంటో, పెళ్లి గురించి అతని అభిప్రాయం ఏంటో, రొమాన్స్ కోసం ఎలా పరితపిస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఆశు రెడ్డి, అరియనా గ్లోరీలతో బోల్డ్ ఇంటర్వ్యూలు అంటూ తన విచిత్రమైన అభిప్రాయాలను బయటపెట్టారు. అలాంటి వర్మతో ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ ఎలా సాగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే వర్మ ఇంద్రజతో రొమాంటిక్ డాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

పార్టీని తలపిస్తున్న ఈటీవీ ప్రోగ్రాం

ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోల ప్రకారం, ఈ సారి న్యూ ఇయర్ ప్రోగ్రాం పార్టీ వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మందు, చిందు, మగువ ఇలా ఒక పబ్ వాతావరణాన్ని మల్లెమాల టీం సృష్టించింది. ఇందులో పేలిన అడల్ట్ జోక్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ఇంకో నాలుగు రోజుల ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంపై బుల్లితెర ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!


Share

Related posts

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ పర్యటన ఇలా..

somaraju sharma

Amritha Aiyer Beautiful Clicks

Gallery Desk

‘సెవెన్’ విడుదలపై స్టే

Siva Prasad