నిన్ననే క్లైమాక్స్ అంటూ హాట్ హాట్ సినిమా యూట్యూబ్ లో దింపిన రామ్ గోపాల్ వర్మ ఇవాళ మళ్ళీ నేకేడ్ NNN Movie అంటూ మరొక ట్రెయిలర్ విడుదల చేశాడు. థియేటర్ లలో సినిమా లు విడుదల చేసే అవకాశం లేకపోవడం తో యూట్యూబ్ నీ , ఇంటర్నెట్ నే నమ్ముకున్న రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో దూసుకుపోతున్నాడు. యువతే లక్ష్యం గా సినిమా లు తీస్తాడు అనే పేరు ఉన్న రామూ ఈ సారి మరింత హాట్ గా టెంపరేచర్ వేడెక్కించే పనిలో పడ్డాడు.
ఒక ఆడ మనిషి ఒంట్లో అన్నీ పార్ట్ లూ రకరాకాల యాంగిల్స్ లో చూపిస్తూ ఈ ట్రైలర్ సాగుతుంది. మధ్యలో వచ్చే రామూ స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదోరకంగా ఉంది. ఇంతకీ ఆ వనిత ఎవరు ? నిజమైన స్త్రీ యే నా లేక దయ్యమా ? లేక మర్డర్ చేయబోతున్న హంతకురాలా అనే విధంగా ట్రెయిలర్ చిత్రీకరించారు.