RGV: అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు చివాట్లు రాముయిజం..!!

Share

RGV: ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఇండస్ట్రీలో ప్రముఖులకి నచ్చటం లేదు. ఈ విషయంలో ఇప్పటికే స్టార్ హీరోలు మీడియా సమావేశాలు నిర్వహించి… జగన్(Jagan) ప్రభుత్వం పై సెటైర్లు వేయడం జరిగింది. హీరో నాని(Nani) సినిమా థియేటర్ల పరిస్థితిలో పక్కనే ఉండే కిరానా కోట్లు పరిస్థితి బాగుందని వెటకారం చేశారు. హీరో హీరో సిద్ధార్థ(Siddartha) ఏపీ మంత్రులు విలాసవంతమైన ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుందని సినిమా టికెట్ల వ్యవహారంలో ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఈ తరుణంలో తాజాగా కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma) ఈ వ్యవహారంపై స్పందించారు.

YS Jagan: Ram Gopal Varmaను అడ్డుకున్న పోలీసులు.. ఇదేనా ప్రజాస్వామ్యం అన్న జగన్! - ycp leader jagan respond due to ram gopal varma detained by police | Samayam Telugu

ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా టికెట్ల విషయం గురించి మాట్లాడుతూ… ఏపీ గవర్నమెంట్.. సినిమా టికెట్ల విషయంలో కలుగజేసుకోవటం ముమ్మాటికి తప్పు. అది నిర్మాతలకు కష్టం తెస్తోంది. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ఉత్పత్తి దారులకు ఉంటుంది. అయితే దాన్ని కొనాలా..? వద్దా..? అనేది వినియోగదారుడి ఇష్టం. సినిమాని చూడాలనుకొనేవారు టికెట్ ఎంత ఉన్నా కొని చూస్తారు.. నచ్చనివారు మానేస్తారు. అది వారి ఇష్టం. సాధారణ కారు ధరకు బెంజ్ కారు ఇవ్వాలంటే ఎలా? టికెట్ ధరలు తగ్గించటం ద్వారా ప్రభుత్వం కావాలనే సినిమా ఇండస్ట్రీ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తుందా? లేదా? అనేది నాకు తెలియదు.

Ys Jagan: జగన్ డ్రెస్సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాంగోపాల్ వర్మ..!! | News Orbit

ఇక హీరోల రెమ్యూనిరేషన్ తగ్గించుకోమనడం.. సాధ్యం కానీ పని. డీజే తరుణంలో సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల హీరోల రెమ్యునేషన్ తగ్గుతుంది.. అనేది ముమ్మాటికి తప్పు. నష్టపోయేది ప్రొడ్యూసర్… అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేయటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మొదటి నుండి రామ్ గోపాల్ వర్మ జగన్ కి కొద్దిగా సపోర్ట్ చేస్తూ చాలా సందర్భాలలో పొగిడాడు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ నాయకులకు ఒకలా ఉంటే వైయస్ జగన్ తీరు మరోలా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటారు. గడ్డాలు మీసాలు ఇంకా రకరకాల ఫీట్ లు చేయకుండా.. ప్రజలతో కలిసి పోతారు.. అంటూ జగన్ ని అప్పట్లో పొగిడారు. ఈ క్రమంలో సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో జగన్ ప్రభుత్వాన్ని రాంగోపాల్ వర్మ ప్రశ్నించడం రాజకీయంగా ఇటు సినిమా పరంగా సంచలనంగా మారింది.


Share

Related posts

Nani : నాని పక్కన నటించిన హీరోయిన్ స్టార్ అవుతుందనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్ ..!

GRK

ప్ర‌భాస్ మ‌న‌సు ప‌డ్డాడు…

Siva Prasad

చిరంజీవికి జగన్ బంగారం లాంటి వార్త

somaraju sharma