సినిమా

ట్రైలర్ లోనే చూపించేశారు

Share

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. అన్నీ నిజాలే చెప్తాను, ఇదే ఎన్టీఆర్ అసలు కథ అని ముందు నుంచీ చెప్పుకుంటూ వచ్చిన వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ తో చాలా మందికి వణుకు పుట్టించాడు. సరిగ్గా చెప్పాలి అంటే వర్మ, ఈ ఒక్క ట్రైలర్ తో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వారి గుండెల్లో నేరుగా పెద్ద గుణపమే దించాడు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు ఏంటి? తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ ని సొంత మనుషులే ఎలా పక్కన పెట్టారు. ఒంటరిగా ఉన్న, కాదు కాదు కుటుంబ సభ్యుల వలన ఒంటరితనంలోకి వెళ్లిపోయిన ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా వచ్చింది? ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల పెళ్లి ఎలాంటి పరిణామాలకి దారి తీసింది? అన్నది స్పష్టంగా చూపించాలనుకున్న వర్మ, ట్రైలర్ లోనే మొత్తం చూపించేశాడు. ఒక వర్గం కారణంగా ఇప్పటి వరకూ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన పరిణామాలని ఒకవైపునే చూసిన ప్రజలకి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ తోనే అనేక విషయాలు చెప్పడంలో వర్మ పూర్తిగా సక్సస్ అయ్యాడు. సరైన కథ తగిలితే వర్మ తనలోని దర్శకుడిని ఏ స్థాయిలో వాడుతాడో నిరూపించిన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ నిరూపించింది.


Share

Related posts

‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ తోనే స్టోరీ మొత్తం అర్థం అయిపోయిందిగా…!

arun kanna

అత‌డితోనే డేట్‌కి వెళ్తానంటున్న రాశి ఖ‌న్నా.. చైతు రిప్లై వైర‌ల్‌!

kavya N

Ileana: ఇలియానాను ఇలా చూసి ఎన్నేళ్లు అయింది.. వైర‌ల్‌గా మారిన లేటెస్ట్ పిక్స్‌!

kavya N

Leave a Comment