Richa Gangopadhyay: ప్రభాస్ హీరోయిన్ అంటే మరెవరో కాదు, మిర్చి బ్యూటీ రిచా గంగోపాధ్యాయ.. మొదటి సినిమా ‘మిరపకాయ్’ సినిమాతోనే ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దాని తరువాత వచ్చిన ‘మిర్చి’ మూవీ ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో ఆమె ఇక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరుసగా ‘నాగవల్లి’ ‘సారొచ్చారు’ ‘భాయ్’ వంటి బడా సినిమాలు చేసింది. అలాగే తమిళంలో ‘మాయక్కమ్ ఎన్న’ (తెలుగులో Mr. కార్తిక్) – ‘ఓస్తే’.. బెంగాలీలో ‘బిక్రమ్ సింఘా’ చిత్రాల్లో నటించింది. అయితే ఆమె టైం బాలేదేమో కానీ, చేసిన సినిమాలన్నీ బాక్షాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో అవి రిచా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.
అలా షాకిచ్చిన రిచా?
తరువాత కూడా ఆమెని మంచి ఆఫర్లే వరించాయి. నాగార్జున, వెంకటేష్, ధనుష్, శింబు వంటి స్టార్ హీరోల సరసన నటించినా కూడా ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. దీంతో ఆమె సడెన్ గా సినిమా ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి అమెరికా కు వెళ్ళిపోయి ఉన్నత చదువుల మీద దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను 2019లో సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న చాలా రోజుల తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇదిగో ప్రసుతం ఇలా వుంది!
USAలోనే ఆమె తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. 2021 మే నెలలో మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటోంది. అయితే సదరు ఫోటోల్లో రిచా ముఖం చూసి ఫ్యాన్స్ ఒకింత చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆధారణంగా ఏ అమ్మాయి అయినా.. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత ఒకలాగా వుంటారు. సరిగ్గా అదే పరిణామం ఈమెలో కనిపించడం గమనార్హం. ఇక సినిమాలో ఎంత అందంగా కనిపించిన హీరోయిన్ రిచా లో ఈ ఛేంజెస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.