కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 80 కోట్ల బడ్జట్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటేనే అదో పెద్ద సాహసంగా చూశారు. ఈ డేర్ ని చేయడంలో వెనుకాడని రాకింగ్ స్టార్ యష్, కెజీఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో రాకీగా కనిపించిన యష్, మాస్ ప్రేక్షకులకి డెమి గాడ్ గా కనిపిస్తున్నాడు. ప్రతి సీన్ లో హీరోయిజం ఎలివేట్ చేయడంతో బీ, సీ సెంటర్స్ లోని ఆడియన్స్ థియేటర్స్ కి రిపీటెడ్ గా వస్తున్నారు. వన్ మ్యాన్ షో చేసిన యష్, హీరోయిజంకి కొత్త అడ్రెస్ గా నిలిచాడు. టేకింగ్ నుంచి మేకింగ్ వరకూ ఈ సినిమాని బయటకి తీసుకురావడంలో 24 క్రాఫ్ట్స్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. డైలాగ్స్ కానీ రాకీ, అదే యష్ బాడీ లాంగ్వేజ్ కానీ కెజీఎఫ్ సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా హెల్ప్ అయ్యింది.
అన్ని భాషల్లో థియేటర్స్ కౌంట్ పెంచుకుంటున్న ఈ సినిమా స్లో పాయిజన్ లా ఎక్కుతుంది, ఒక రీజినల్ సినిమాకి ఇంత సత్తా ఉందా అనే స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్న కెజీఎఫ్ సినిమాకి ఇండస్ట్రీ వర్గాల బ్యాక్ అప్ కూడా బాగానే ఉంది అయితే ఎవరు అండగా నిలిచినా కూడా సినిమాలో విషయం లేకపోయినా, హీరోలో దమ్ము లేకపోయినా సినిమా ఆడాదు. ఆ రెండింటి విషయంలో కెజీఎఫ్ టాప్ నాచ్ లో ఉంది కాబట్టే ఈరోజు ఇలాంటి రిజల్ట్ ని చూస్తుంది. ఈ చిత్ర యూనిట్ పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు వస్తున్న పేరు, డబ్బులు. ఇండియా వైడ్ కన్నడ సినిమా సత్తా చాటిన కెజీఎఫ్ అందరి మనసులు గెలవడమే కాకుండా కన్నడ సినిమా స్థాయిని పెంచింది. ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ త్వరలోనే వన్ ది మోస్ట్ ప్రొడక్టివ్ ఇండస్ట్రీగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారీ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి థాంక్స్ చెప్తూ కెజీఎఫ్ చిత్ర యూనిట్ సక్సస్ టూర్ మొదలుపెట్టారు, ఇప్పటికే టాలీవుడ్ సినీ ఫ్యాన్స్ తో యష్ కి మంచి బాండింగ్ ఏర్పడింది కాబట్టి దర్శక ధీరుడు రాజమౌళి, యష్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడని, rrr సినిమాలో అతన్ని విలన్ గా తీసుకుంటే కన్నడలో మార్కెట్ పెరుగుతుందనే ఆలోచనలో జక్కన్న ఉన్నాడని చాలా రూమర్స్ బయటకి వచ్చాయి కానీ రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన యష్, అవన్నీ రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేశాడు. సో స్వయంగా యాష్ ఏ చెప్పడంతో ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.