Rohit Shetty: బాలీవుడ్ లో రోహిత్ శెట్టి నటుడిగా కంటే డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో రోహిత్ శెట్టి కూడా ఒకరు.. ఇంతకుముందు రోహిత్ శెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు తీయబోయే వెబ్ సిరీస్ పై తను ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు.. బాలీవుడ్ యాక్టర్, టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కి హైదరాబాదులో శనివారం యాక్సిడెంట్ అయింది.. ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ ను రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నాడు..

ఈ సిరీస్ షూటింగ్ భాగంగా హైదరాబాద్ శివారులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ఆ సన్నివేశంలో భాగంగా ప్రమాదం జరిగింది . ఈ యాక్సిడెంట్ లో రోహిత్ శెట్టికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్స్ స్పాట్ నుంచి ఆయనను సిబ్బంది హుటాహుటిన ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు ముందు రోహిత్ శెట్టికి ప్రాథమిక చికిత్స అందించారు.. ఆ తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత రోహిత్ శెట్టికి సర్జరీ చేసినట్లు సమాచారం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి తిమితంగా ఉందని సమాచారం.