కౌశల్ ఆర్మీకి సారీ చెప్పిన రోల్ రిడా

Share

తాను ఒకటి తలిస్తే, దేవుడు ఇంకొకటి తలిచినట్లు.. ర్యాప్పర్ రోల్ రిడా ఒకటి అనుకుంటే అది కాస్త ఇంకొకటి అయి సోషల్ మీడియాలో సారీ చెప్పే వరకూ వెళ్ళింది. అసలు రోల్ రిడా ఎందుకు సారీ చెప్పాడు, ఎవరికీ సారీ చెప్పాడు అంటారా? ప్రొఫెషనల్ గా ర్యాప్ సాంగ్స్ పాడే రోల్ రిడాకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆ పేరు వలనే స్టార్ షో బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లాడు. అక్కడ అందరిని అలరించి, తన పాటలతో మెప్పించిన రోల్ రిడా ఫైనల్ కి ముందు ఎలిమినేట్ అయ్యాడు. ఆ హౌజ్ లో ఉన్నన్ని రోజులు, అలరించిన రోల్ రిడాకి కౌశల్ కి కొన్ని సార్లు మాట మాట అనుకునే వరకూ వెళ్లింది. ఇలాంటి సమయంలో కౌశల్ ఆర్మీ రోల్ రిడాని టార్గెట్ చేస్తూ బాగా ట్రోల్ చేశారు.

ఆ తర్వాత షో అయిపోవడం కౌశల్ బయటకి వచ్చి స్టార్ స్టేటస్ అందుకోవడం జరిగిపోయింది, అయితే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కౌశల్ అన్ని ఛానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తనకి డాక్టరేట్ వచ్చిందని, త్వరలో ఇస్తున్నారని మీడియా ముందు చెప్పాడు, అది కాస్త ఉత్త వార్త అని తెలిసిపోవడంతో సోషల్ మీడియాలో కౌశల్ పై చాలా వార్తలు వచ్చాయి. ఇదే విషయం ఇప్పుడు రోల్ రిడా మెడకు చుట్టుకుంది. హౌజ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత, రీసెంట్ గా వైరల్ అయిన ‘రాదు’ అనే సాంగ్ చేశాడు. మంచి లిరిక్స్ తో, సూపర్ ర్యాప్ తో వచ్చిన ఈ పాట ఇన్స్టాంట్ హిట్ గా నిలిచింది. అయితే పాట మధ్యలో ఆర్మీలు ఫామ్ చేస్తే డాక్టరేట్ వస్తదా అంటూ లైన్ ఉండడంతో అది కౌశల్ ని ఎగతాళి చేసినట్లు ఉందని కౌశల్ ఆర్మీ కామెంట్స్ చేస్తున్నారు.

అక్కడితో ఆగని కౌశల్ ఫ్యాన్స్, యూట్యూబ్ లో రాదు సాంగ్ ని డిజ్-లైక్స్ చేస్తూ, నెగటివ్ కామెంట్స్ చేయడంతో డిజప్పాయింట్ అయిన రోల్ రిడా, “ఈ మధ్య కాలంలో ట్రోల్ అయిన అంశాలన్నీ సాంగ్ లో పెట్టాను కానీ కౌశల్ ను ట్రోల్ చేయాడమనేది తన ఉద్దేశం కాదని, కౌశల్ తనకి టాస్కుల్లో ఎంతో హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చాడు. ఇంకా వాళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుందని, కౌశల్ ని ట్రోల్ చేసి వాళ్ల బంధాన్ని ఎందుకు చెడగొట్టుకుంటానని చెప్పుకొచ్చాడు. తాను అనుకున్నది ఒకటి.. అయింది ఒకటని.. ఈ విషయాన్ని కౌశల్ ఆర్మీ అర్థం చేసుకోవాలి .. వాళ్లకి సారీ” అని క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పటికైనా కౌశల్ ఫ్యాన్స్ కూల్ వ్అవుతారేమో చూడాలి.


Share

Related posts

Khiladi : టీజర్‌తో ఖిలాడి వచ్చేస్తున్నాడు..!

GRK

నాగ్.. ఎట్టకేలకు!

Siva Prasad

కియారా అద్వానీ నే అందరూ కావాలనుకోవడానికి అసలు కారణం ఇదే ..?

GRK

Leave a Comment