Categories: సినిమా

RGV: వర్మ ముసలోడే కానీ, మామ్మూలోడు కాడు.. పూజ – వర్మ మధ్య రొమాంటిక్ చర్చ!

Share

RGV: నిత్యం నిత్యానందలాగా ఎప్పుడూ వివాదాల్లో వుంటూ ఏదోఒక వార్తలో వుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రోజురోజుకీ తన పైత్యాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఆయన ఈమద్య కాలంలో హీరోయిన్స్ ను ఓ రేంజ్ లో చూపిస్తున్న దర్శకులలో వర్మ ముందుంటాడు. ఐస్ క్రీమ్ సినిమా సిరీస్ నుండి మొదలైన వర్మ హీరోయిన్స్ ప్రస్థానం నేటివరకు ఏవిధంగా కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. డేంజరస్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ మద్య పీక్స్ లో రొమాన్స్ ను చూపించిన వర్మ తన సినిమాలను మాత్రం ఆడించలేకపోతున్నాడు.

Romantic talk between RGV and Pooja!

మసాలాలు వర్కవుట్ కావడంలేదు!

అవును.. ఎంత మసాలా దట్టించినప్పటికీ వర్మ సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించలేకపోతున్నాయి. ఇకపోతే వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. నిత్యం ఏదోఒక రచ్చ చేస్తూనే ఉంటాడు. ఇక సినిమాలు విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తిన వర్మ తన పంథాని మాత్రం మార్చడం లేదు. ఈ క్రమంలో ముసలి వర్మ పని అయిపోయిందని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ తో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. వాటికి పెడుతున్న కామెంట్స్ చూస్తూ ఉంటే బాబోయ్ వర్మ నువ్వు మామ్మూలోడివి కాదు అనాల్సిందే.

Romantic talk between RGV and Pooja!

పూజ – వర్మ – రొమాంటిక్ చర్చ!

తాజాగా ఆయన తెరకెక్కించిన ‘లడ్కీ’ సినిమా హీరోయిన్ ‘పూజా భలేకర్’ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో బికినీతో పూజా భలేకర్ మతులు పోగొట్టే విధంగా ఉంది. ఆ వీడియోకు పూజా ‘నన్ను నేను ఎలా ట్రీట్ చేసుకుంటానో మీరు అలాగే ట్రీట్ చేయండి’ అని కామెంట్ పెట్టింది. అందుకు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందిస్తూ, నిన్ను ఎలా ట్రీట్ చేయాలి? ఐస్ క్రీమ్ లాగానా అంటూ ప్రశ్నించాడు. అందుకు పూజా భలేకర్ స్పందిస్తూ… నన్ను ప్రేమతో ట్రీట్ చేయాలి.. ఈ వేసవిలో ఐస్ క్రీమ్ అనే సౌండ్ వినడానికి చాలా అహ్లాదకరంగా ఉందంటూ కూడా పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన ట్వీట్స్ చూసి వర్మ స్వీట్స్ భలే తినిపిస్తాడే అని కామెంట్లు చేస్తున్నారు.


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

30 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

31 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

1 hour ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago