Roshan: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ అందరికి సుపరిచితుడే. హీరోగా అదేవిధంగా విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ గుర్తింపు దక్కించుకున్న శ్రీకాంత్ తన కొడుకు రోషన్ నీ “నిర్మల కాన్వెంట్” హీరో గా ఎంట్రీ చేయించడం తెలిసిందే. ఈ సినిమాలో రోషన్…లుక్స్ … మరియు నటన పర్వాలేదనిపించింది. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని “పెళ్లి సందD” సినిమా చేసిన.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
కానీ నటన పరంగా రోషన్ కి మంచి మార్కులు వచ్చాయి. రాఘవేంద్ర దర్శకత్వంలో అప్పట్లో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి కి కొడుకు నటించిన సినిమా కి… ఏమాత్రం పోలిక లేకుండా పోయింది. కానీ రోషన్ డాన్స్ మరియు నటన సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్న రోషన్… సినిమాలు ఒప్పుకోవడం విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నడు. ఇటువంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్ నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రోషన్ ఇప్పుడు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం… ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఏకంగా జాతీయ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి రోషన్ రెడీ కావడం జరిగింది. స్వప్న సినిమాస్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల రోషన్ బర్త్ డే సందర్భంగా వైజయంతి మూవీస్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్ లో అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.