Roshan Meka: సీనియర్ స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిర్మల కాన్వెంట్ మూవీతో హీరోగా సినీ కెరీర్ ప్రారంభించిన రోషన్.. లాంగ్ గ్యాప్ తీసుకుని `పెళ్లి సందD`తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్గా నటించింది.
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, గౌరీ రోనంకి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీంతో కెరీర్లో మంచి టర్నింగ్ పాయింట్ కోసం తన పేరును మార్చుకున్నాడు రోషన్. సినీ తారల్లో ఎంతో మంది తమ పేరును మార్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అలాగే శ్రీకాంత్ తనయుడు కూడా తన పేరులోని స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు. సినిమా వాళ్ళు ఎక్కువగా నమ్మేది న్యూమరాలజీ. దాని ప్రకారం తన పేరుకు అదనంగా ‘n’ని జోడించాడు. ఓ న్యూమరాలజిస్ట్ సూచన మేరకు ఆయన ఈ డిసీజన్ తీసుకున్నారని సమాచారం.
మరి ఈ విధంగా అయినా రోషన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. కాగా, ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేయబోతున్నట్లు ఇటీవలె ప్రకటించాడు. ‘అద్వైతం’ అనే షార్ట్ ఫిలింతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు ప్రదీప్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివారాలు బయటకు రానున్నాయి.